కుటుంబ సెటిల్‌మెంట్ ద్వారా వదులుకున్న ఆస్థి గిఫ్ట్ చేస్తే చెల్లదు – సుప్రీంకోర్టు

ఒకసారి హక్కు వదులుకున్న యాజమాన్య ఆస్తుల పై హక్కులు ఉండబోవు

  • కుటుంబ సెటిల్‌మెంట్ ద్వారా వదులుకున్న ఆస్థి గిఫ్ట్ చేస్తే చెల్లదు` సుప్రీంకోర్టు
  • ఒకసారి హక్కు వదులుకున్న యాజమాన్య ఆస్తుల పై హక్కులు ఉండబోవు.

న్యాయనేత్రం: అయితగాని జనార్ధన్ (9705005658).
కుటుంబ ఆస్థుల వివాదాల విషయంలో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వెలువరించింది. ఫ్యామిలీ సెటిల్‌మెంట్ ద్వారా ఒకసారి పరిష్కరించుకున్న ఆస్థుల విషయంలో కట్టుబడి ఉండాలే తప్ప మళ్లీ వాటిని వివాదాస్పదం చేయడం, బహుమతి డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని సుప్రీంకోర్టుతన తీర్పులో వెలువరించింది. 1977 సంవత్సరంలో మొదలైన ఈ వివాదానికి అంతిమంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 14,2026 న ముగింపు పలికింది. ట్రయల్ కోర్టులో 1977లో మొదలైన దావాలు అదే కోర్టులో అప్పీలు, హై కోర్టులో అప్పీలు, రాజీ సెటిల్‌మెంట్లు, మళ్లీ వివాదం, దావాలు, అంతిమంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన కుటుంబ ఆస్థి కేసుకు తాజాగా తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్‌తో సుప్రీంకోర్టు ముగింపు పలికింది. వివరాల్లోకి వెళితే.. వెంకటరెడ్డి, మాణిక్యమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, సుధాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి. కాగా వీరి ముగ్గురి తండ్రి మరియు పెద్ద వాడైన సుధాకర్ రెడ్డి రజాకార్ల ఉద్యమంలో కాలం చేశారు. ఇక మిగిలింది తల్లి మాణిక్యమ్మ, మధుసూదన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డిలు. వీరితో బాటు వీరి పెద్ద అన్న భార్య అనసూయమ్మ కూడా వారసురాలయింది. ఈ క్రమంలో 1959లో కుటుంబ ఆస్తి కి సబంధించి ఫ్యామిలీ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ రాసుకుని ఆస్తులను పంచుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం మాణిక్యమ్మకు 53 ఎకరాలు, అనసూయమ్మకు 91 ఎకరాలు, మధుసూదన్ రెడ్డికు 62 ఎకరాలు, జనార్ధన్ రెడ్డికి 131 ఎకరాలు చెందే విధంగా ఫ్యామిలీ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ రాసుకున్నారు. పిల్లలు లేని అనసూయమ్మ 1975లో వెంకట్రాజిరెడ్డిని దత్తత తీసుకుంది. పైన తెలిపిన ఆస్తులతో బాటు, కొన్ని నివాస గృహాలు, ఈ ఫ్యామిలీ సెటిల్‌మెంట్ పరిధిలోకి రాలేదు. ఈ క్రమంలో అనసూయమ్మ, మరియు ఆమె దత్తపుత్రుడైన వెంకట్రాజిరెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో యావదాస్తుల పై పార్టీషన్ దావా దాఖలు చేశారు. అప్పటికే మధుసూదన్ రెడ్డి తన వాటాకు వచ్చిన ఆస్తులను కొన్నింటిని అమ్మేశారు. కొనుగోలు చేసినవారు మహబూబ్ నగర్ కోర్టులో పర్మినెంట్ ఇంజక్షన్ కోరుతూ దావా దాఖలు చేశారు. ఈ దావా కూడా సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్‌కు బదిలీ అయి రెండు జాయింట్‌గా విచారించబడ్డాయి. ఇంజక్షన్ కేసు ఆస్థికొనుగోలు దారులు గెలిచారు. కాగా పార్టీషన్ కేసులో ఏవైతే సెటిల్‌మెంట్‌కు సంబంధంలేని ఆస్తులను మాత్రమే పంపకానికి అర్హమైన వని తీర్పు ఇస్తూ ట్రయల్ కోర్టు కేసును కొట్టేసింది. అంటే పాక్షికంగా ఆస్తుల పంపకం చేయలని తీర్పు సారాంశం. దీన్ని సవాలు చేస్తూ ప్రతివాది మధుసూదన్ రెడ్డి, హై కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగా జనార్ధన్ రెడ్డి కాలం చేశారు. దాంతో ఆయన కొడుకు వెంకటరెడ్డి వారసుడిగా కేసులో ఇంప్లీడ్ చేయబడ్డారు. ఇతని చెల్లి నిర్మల స్వతంత్రంగా మరో అప్పీల్‌కు వెళ్లింది. ఇలా హై కోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగానే మధుసూదన్ రెడ్డి, తన ఒదిన అనసూయమ్మ, ఆమె దత్తపుత్రుడు వెంకట్రాజిరెడ్డిలతో 1986లో ఒక డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకొని కోర్టులో దాఖలు చేసి, ఆ ప్రకారం తీర్పు వెలువరించవలసిందిగా కోర్టును అభ్యర్ధించారు. ఈ రాజీ సెటిల్‌మెంట్‌ను రికార్డు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. డీడ్ ప్రకారం మాణిక్యమ్మ ఆస్తుల పై మధుసూదన్ రెడ్డి హక్కులు వదులుకున్నారు. రెండు నివాస గృహాలు తీసుకున్నారు. దీంతో కేసు రాజీ అయినట్లయింది. వెంకటరెడ్డి చెల్లి నిర్మల వేసిన కేసును కూడా కొట్లేస్తూ, తనకు వాటా కావాలంటే వేరే దావా దాఖలు చేసుకోవచ్చని స్వేచ్చ నిస్తూ కేసు కొట్టేసింది. ఈ క్రమంలో 2007 న మధుసూదన్ రెడ్డి, మాణిక్యమ్మ వాటాకు చెందిన భూములను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంకటరెడ్డి కొడుక్కు అనగా జనార్ధన్ రెడ్డి మనుమడైన సిద్దార్ధ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశాడు. రాజీ సెటిల్‌మెంట్‌లో మాణిక్యమ్మ ఆస్తుల పై హక్కులు వదులకున్న మధుసూదన్ రెడ్డి, సిద్దార్ధరెడ్డికి ఎలా గిఫ్ట్ చేస్తారంటూ అనసూయమ్మ, ఆమె దత్తపుత్రుడు వెంకట్రాజిరెడ్డి మహబూబ్‌నగర్ సివిల్ కోర్టులో గిఫ్ట్‌డీడ్ క్యాన్సిల్ చేస్తూ, తమ టైటిల్‌ను స్థిరీకరించి, రెవిన్యూ రికార్డులలో తమ పేరు నమోదు చేయాలని దావా దాఖలు చేశారు. ఈ దావాలో హై కోర్టులో అప్పీల్‌లో వేసిన డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ ను పరిగణలోకి తీసుకోకుండా కేసు కొటేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే అనసూయమ్మ కన్ను మÖసింది. దీంతో వెంకట్రాజిరెడ్డి ఆయన సోదరి మాలినీ దేవి హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్టుకూడా ఈ 1959 సెటిల్మెంటHను 1989 హైకోర్టులో దాఖలు చేసిన సెటిల్మెంట్లను పరిగనలోకి తీసుకోకుండా 2022లో కేసు కొట్టేసింది. దీంతో వివాదం సుప్రీకోర్టును చేరింది. తాజాగా వెలువడిన తీర్పు ప్రకారం 1959లో జరిగిన సెటిల్మెంట్ల ప్రకారం, మరియు 24.02.1986 తేదీన హై కోర్టులో ఫైల్ చేసిన డిస్ప్యూట్ సెటిల్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకోక పోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఒకసారి ఫ్యామిలీ సెటిల్‌మెంట్ జరిగితే కుటుంబం మొత్తం దానికే కట్టుబడి ఉండాలని, హై కోర్టులో రికార్డు అయిన డిస్ప్యూట్ సెటిల్‌మెంట్‌ను కూడా ధిక్కరిస్తూ గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌లు చేయడం చట్టబద్దం కాదంటూ, అప్పీల్ దారులైన అనసూయమ్మ వారసులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సైటేషన్ ఈ క్రింద క లదు. న్యాయవాదులు పలు సివిల్ కేసుల్లో ఫైల్ చేసుకొనుటకు సౌలభ్యంగా అందిస్తున్నాము.

CITATION:

B. Anasuyamma (Died) Per LRs v. B. Madhusudhan Reddy (Died) Per LRs
Civil Appeal · 2026 INSC 1126

Decided 14 Oct 2026
Civil Appeal No. 13759 of 2026
Justice Sanjay Kumar · Justice Sanjeev Sachdeva

Leave A Reply

Your email address will not be published.